![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -544 లో.. విశ్వపై అమూల్య కోప్పడుతుంది. నీ మాటలు అసలు నమ్మలేనని అంటుంది. ప్లీజ్ నేను మారిపోయాను నేను మారిపోకుంటే మొన్న మీ అన్నయ్య మా నాన్న పై చెయ్ చేసుకున్నప్పుడు నేను గొడవని సర్దుమణిగేలా చేసాను లేదంటే రక్తపాతం జరిగేదని విశ్వ చెప్తాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మనం కలిసి ప్రేమ, ధీరజ్ లని ఒకటి చేద్దామని విశ్వ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు ప్రేమ ఇని స్టిట్యూట్ దగ్గర ధీరజ్ వెయిట్ చేస్తాడు. ప్రేమ క్లాస్ అవ్వగానే క్యాబ్ బుక్ చేసుకుంటుంది. ధీరజ్ కి మెసేజ్ వస్తుంది. ఎవరో బుక్ చేసుకున్నట్లున్నారని అనుకుంటాడు. అప్పుడే ప్రేమ వస్తుంది నువ్వా అని ప్రేమ అంటుంది. సరే గానీ ఎక్కు అని ధీరజ్ అంటాడు. నేను అసలు ఎక్కను.. క్యాన్సిల్ చేస్తానని ప్రేమ అంటుంది.
అప్పుడే ఒకమ్మాయి ధీరజ్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతుంది. మంచి ఛాన్స్ దొరికిందని ధీరజ్ అనుకొని మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉంటానా.. మీరు చాలా అందంగా ఉన్నారని ధీరజ్ ఆ అమ్మాయిని పొగుడుతాడు. ప్రేమ జలస్ గా ఫీల్ అవుతుంది. నేను త్వరగా వెళ్ళాలని ప్రేమ అనగానే నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావ్ గా అని ఆ అమ్మాయి అంటుంది. లేదు ఇప్పుడు రాకుంటే క్యాబ్ గురించి కంప్లైంట్ ఇస్తానని ప్రేమ అనగానే సరేనని ధీరజ్ అంటాడు. సారి అండి నా నెంబర్ తీసుకోండి అని ధీరజ్ చెప్తాడు. కార్ ఎక్కిన తర్వాత కూడా ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని ధీరజ్ చెప్తుంటే ప్రేమ ఓర్వలేకపోతుంది. మరొకవైపు వేదవతి, నర్మద మాట్లాడుకుంటారు. అసలు కళ్యాణ్ టాపిక్ తీసుకొని వచ్చేది కాకుండే అని వేదవతి అంటుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అత్తయ్య అని నర్మద అంటుంది. ఈ కళ్యాణ్ విషయం మనకి మాత్రమే తెలుసు కదా అని వేదవతి అనగానే వల్లి ఇదంతా చేసిందేమోనని అనుకుంటున్నా.. కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నానని నర్మద అంటుంది. అప్పుడే ప్రేమని తీసుకొని ధీరజ్ వచ్చి ఇంటి ముందు ఆపుతాడు. దాంతో ఇంటికి తీసుకొని వచ్చాడని వేదవతి, నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
స్కానర్ పెట్టు డబ్బు పంపిస్తానని ప్రేమ అనగానే అవసరం లేదు కానీ వెళ్ళమని ధీరజ్ అంటాడు. భద్రవతి వచ్చి డబ్బులు ధీరజ్ పై విసిరేస్తుంది. ఆ డబ్బు తీసుకొని భద్రవతికి ఇస్తు.. నా భార్య నీ ఇంట్లో ఉంటుంది కదా తనని చూసుకుంటున్నందుకు ఈ డబ్బు ఇస్తున్నానని ధీరజ్ అంటాడు. మీరు ఇద్దరు వస్తుంటే ఇంటికి తీసుకొని వచ్చావేమో అనుకున్నానని వేదవతి అనగానే త్వరలోనే వస్తుందని ధీరజ్ అంటాడు. రానని ప్రేమ అంటుంది. ధీరజ్ వెళ్ళిపోతాడు. అక్క అని నిజమైన ప్రేమ చూపించాను కానీ మీరు గొడవ పెట్టుకోవడానికి నా ఇంటికి వచ్చారని భద్రవతిపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:
![]() |
![]() |